Close Menu
  • Home
  • Hindi
  • Malayalam
  • Tamil
  • Telugu
  • Bhojpuri
  • Kannada
  • Artist
Facebook X (Twitter) Instagram Threads
Lyricsila
  • Home
  • Hindi
  • Malayalam
  • Tamil
  • Telugu
  • Bhojpuri
  • Kannada
  • Artist
Lyricsila
Home » Language » Telugu Song Lyrics

Jesus Songs Lyrics in Telugu (Christian Devotional)

0
By admin on 09/11/2025 Telugu Song Lyrics

Here is the Jesus Songs Lyrics in Telugu collection.Discover a soulful collection of Jesus songs lyrics in Telugu that inspire faith, hope, and devotion. This blog brings together the most beautiful Telugu Christian songs, hymns, and worship lyrics that glorify Jesus Christ. Whether you’re looking for traditional Telugu Christian hymns or the latest Telugu Jesus devotional songs, you’ll find meaningful words filled with divine love and spiritual depth.

Jesus songs lyrics in Telugu

Athynatha Simhasanamupai Telugu Jesus Song Lyrics

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే

ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2) “ఆహాహా”

కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణకర్తా స్తోత్రం (2) “ఆహాహా”

స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) “ఆహాహా”

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2) “ఆహాహా”

ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2) “ఆహాహా”

Vandanambonarthumo Prabho Prabho Christian worship songs Telugu Lyrics

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా
వదనంబు లందు కో ప్రభో

ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి యెపుడు గాచియు
ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రము లివిగో (వందనం)

ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమనను నీదు నీతి నొసగు మా
దాత క్రీస్తు నాధ రక్షకా (వందనం)

దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాళి తనువు దినము లన్నియు
నీవొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ
సేవకై యంగీకరించుమా (వందనం)

కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా (వందనం)

మా సభలను పెద్దజేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము (వందనం)

Aahaa Mahaanandame Telugu Christian Devotional Lyrics

ఆహా మహానందమే ఇహపరంబూలన్
మహావాతరుండవ్
మా యేసు జన్మదినం హల్లెలూయా

ఆహా మహానందమే ఇహపరంబూలన్
మహావాతరుండవ్
మా యేసు జన్మదినం హల్లెలూయా

యెహోవా తనయా యేసుప్రభు
సహాయుడా మా స్నేహితుడా
యెహోవా తనయా యేసుప్రభు
సహాయుడా మా స్నేహితుడా

ఇహాపరంబులెమ్ ఇమానుయేల్
మహానందముతో నిన్నారధింతుము
ఇహాపరంబులెమ్ ఇమానుయేల్
మహానందముతో నిన్నారధింతుము
నిన్నారధింతుము హల్లెలూయా (ఆహా)

కన్యాకగర్భ మందు పుట్టగా
ధన్యుడవంచు దూతలేన్దరో
కన్యాకగర్భ మందు పుట్టగా
ధన్యుడవంచు దూతలేన్దరో

మాన్యులు పేద గొల్లలెందరో
అన్యులు తూర్పు జ్ఞానులెందరో
మాన్యులు పేద గొల్లలెందరో
అన్యులు తూర్పు జ్ఞానులెందరో
నినారాధించిరి హల్లెలూయా (ఆహా)

Innellu Ilalo Vunnamu Manamu Jesus Song Lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం
స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం

లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం
లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం

పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం (ఇన్నేళ్లు)

మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం
మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం

నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం (ఇన్నేళ్లు)

Unnathamaina Sthalamulalo Telugu Yesu songs lyrics

ఉన్నతమైన స్థలములలో
ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా

చెదరి పోయినది మా దర్శనము
మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు
నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి
నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా
ఆత్మతో మము నిలుపుము దేవా “ఉన్నత”

పరిశోధించుము మా హృదయములను
తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో
వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి
సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన
స్థిరపరచి బలపరచుము దేవా “ఉన్నత”

మా జీవితములు నీ సన్నిధిలో
పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో
రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము
నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము
భారము తోడ ప్రకటించెదము “ఉన్నత”

Sudhamadhura Kiranala Arunodayam

సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం

తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది

దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలను మిగిలాడని
దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలను మిగిలాడని

నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు తెరిచాడని
నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు తెరిచాడని

ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ

(సుధా మధుర కిరణాల అరుణోదయం…)

లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు
లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)

ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము

(సుధా మధుర కిరణాల అరుణోదయం…)

Bethlehemulo Sandhadi Telugu Christmas Folk Song Lyrics

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)
(బెత్లెహేములో సందడి…)

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)
(బెత్లెహేములో సందడి…)

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)
(బెత్లెహేములో సందడి…)

Rare Chuthamu Raja Suthuni Telugu Christmas Song Lyrics

రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2)

దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2)
(రారే చూతము రాజసుతుని…..)

కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2)
(రారే చూతము రాజసుతుని…..)

బాలు డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2)
(రారే చూతము రాజసుతుని…..)

యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2)
(రారే చూతము రాజసుతుని…..)

Ultimate collection of Jesus songs lyrics in Telugu – your one-stop destination for Telugu Christian songs, Yesu songs, and Telugu devotional worship lyrics. Here, you can explore hundreds of inspiring and soul-touching Telugu Jesus songs that express love, faith, and devotion towards Lord Jesus Christ. Our blog features Christian praise and worship songs in Telugu, including old traditional hymns and the latest Telugu gospel songs. Each lyric is carefully presented in Telugu script for easy reading and spiritual connection. Whether you’re searching for Sunday worship songs, Christian prayer songs, or Telugu Yesu padalu, you’ll find meaningful lyrics that bring you closer to God.

  • Athynatha Simhasanamupai Telugu Jesus Song Lyrics
  • Vandanambonarthumo Prabho Prabho Christian worship songs Telugu Lyrics
  • Aahaa Mahaanandame Telugu Christian Devotional Lyrics
  • Innellu Ilalo Vunnamu Manamu Jesus Song Lyrics
  • Unnathamaina Sthalamulalo Telugu Yesu songs lyrics
  • Sudhamadhura Kiranala Arunodayam
    • Bethlehemulo Sandhadi Telugu Christmas Folk Song Lyrics
    • Rare Chuthamu Raja Suthuni Telugu Christmas Song Lyrics
Share. Facebook Email WhatsApp

You Might Also Like

Inthandamga Lyrics – Good Luck Sakhi – Devi Sri Prasad

So So Ga song Lyrics – Manchi Rojulochaie – Sid Sri Ram

Nagumomu Thaarale Lyrics | Radhe Shyam -Sid Sriram

Jai Balayya Lyrics – Akhanda | Balakrishna

Rowdy Pattasu Lyrics -(Telugu) Santhosh Dhayanidhi

Yevarive Prema Hrudayama Lyrics – IPL (It’s Pure Love)- Sid Sriram

Kannil Kannadi Chantham Lyrics-Sukran-Shankar Mahadevan

Thangame Thangame Lyrics Translation-Idhayam Murali

Local Sigma Boys Lyrics Translation-Prakambanam

Hridhayamithezhuthum Lyrics-Valathu Vashathe Kallan

Artist
  • Lyricist
  • Music Composer
  • Singers
  • Artist List
Languages
  • Malayalam Lyrics
  • Tamil Song Lyrics
  • Telugu Song Lyrics
  • Kannada Song Lyrics
  • Bhojpuri Song Lyrics
  • Bengali Song Lyrics
  • Haryanvi Lyrics
  • Marathi Song Lyrics
  • Punjabi Lyrics
About

Welcome to Lyricsila.com, your trusted destination for latest song lyrics across multiple Indian languages. We are passionate about bringing music lovers closer to the words behind their favorite songs by offering accurate, well-formatted, and easy-to-read lyrics from a wide range of regional music industries.

At Lyricsila.com, we proudly share lyrics in Hindi, Telugu, Malayalam, Tamil, Kannada, Bhojpuri, Punjabi, and Haryanvi, covering film songs, devotional tracks, and trending song releases. Our goal is to create a simple and reliable platform where users can discover, read, and enjoy lyrics without distractions.

Facebook X (Twitter) Instagram Pinterest
  • Disclaimer
  • Contact Us
  • Privacy Policy
© 2026 Lyricsila. All Rights Reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Ad Blocker Enabled!
Ad Blocker Enabled!
Our website is made possible by displaying online advertisements to our visitors. Please support us by disabling your Ad Blocker.